

జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. భారత్‌లోని 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి 20 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు.
అభ్యర్థుల సౌకర్యార్థం ఎన్‌టీఏ విస్తృత ఏర్పాట్లు చేసింది. 10 వేల మందికి పైగా దివ్యాంగ అభ్యర్థులతో పాటు ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్న 81 మంది విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి, కీమోథెరపీ తీసుకుంటున్న విద్యార్థి వంటి వారికి కూడా ప్రత్యేక సహాయం అందించారు. పరీక్షల్లో పారదర్శకత కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, ఫేస్ ఆథెంటికేషన్, సీసీటీవీ నిఘా, జామర్లు, రాష్ట్ర పోలీసుల సహకారంతో రెండు దశల తనిఖీలు అమలు చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!