
జనరల్

జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర కోసం కేంద్ర భద్రతా సంస్థలు, భారత సైన్యం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఈసారి ‘ఆపరేషన్ శివ’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. యాత్ర మార్గమంతా బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈసారి తొలిసారిగా అత్యాధునిక యాంటీ-డ్రోన్ సాంకేతికతను వినియోగించనున్నారు. సున్నితమైన 55 ప్రాంతాల్లో యాంటీ-డ్రోన్ గన్‌లు, నిఘా పరికరాలు, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలను మోహరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!