
జనరల్

గద్వాల్ విజయలక్ష్మి ను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది. ఆమెతో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్. రాధాబాయి, ఉజ్మా ఆషాయ్ షకీరా నియమితులయ్యారు. వీరి పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది.
కాసోజు శంకరమ్మ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కావడం విశేషం. 2020లో ఏర్పాటైన మహిళా కమిషన్ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. మహిళల హక్కుల కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!