

నేపాల్ రాజధాని కాఠ్మాండూలో ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. 11 ఏళ్ల బాలిక రాధిక మహతో ప్రధాని బాలేంద్ర షాకు రాసిన లేఖ భావోద్వేగ స్పందనను రేకెత్తించింది. “మా కుటుంబం మీ పార్టీకి ఓటు వేసింది. మీరు మా ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు మేమెక్కడ ఉండాలి, ఎక్కడ చదవాలి?” అని ఆమె ప్రశ్నించింది. ఈ చర్యలతో సుమారు 15 వేల మందికి పైగా ప్రజలు ఇళ్లను కోల్పోయారని, దాదాపు 4 వేల తాత్కాలిక నిర్మాణాలు కూల్చివేశారని సమాచారం.
ఈ బాధితులను కాఠ్మాండూకు 75 కి.మీ దూరంలోని బనేపా మున్సిపాలిటీ తాత్కాలిక శిబిరానికి తరలించారు. అక్కడికి మారడంతో రాధిక చదువు ఆగిపోయింది. ఆమె లేఖను ఒక ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ప్రచురించడంతో అది వైరల్ అయింది. అధికారుల ప్రకారం నదీ తీర ప్రాంతాల్లో ఆక్రమణలు పెరగడం వల్ల వరద ముప్పు ఉందని, పట్టణ ప్రణాళిక కోసం ఈ చర్యలు అవసరమని తెలిపారు. అయితే ఈ వివాదంపై నేపాల్ సుప్రీంకోర్టు స్పందించి, సరైన పునరావాస ప్రణాళిక లేకుండా కూల్చివేతలు చేయొద్దని ప్రభుత్వానికి ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!