

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల్లో భాగంగా అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్న సైనికులు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. నెలల తరబడి సముద్రంలోనే ఉండటం, ఆహారం, నీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, మరుగుదొడ్లు సరిగా పనిచేయకపోవడం వంటి పరిస్థితులు వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయని సైనికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, తాము ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్తామో తెలియకపోవడం కూడా ఒత్తిడిని పెంచుతోందని పేర్కొన్నాయి.
సైనికుల కుటుంబాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం. పలువురు సైనికులు నౌక నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సైనికుడిని సముద్రంలోకి దూకిన ఘటన తర్వాత రక్షించినట్లు సమాచారం. నేవీ అంబుడ్స్‌మెన్ నుంచి కుటుంబాలకు ఆత్మహత్యాయత్నాలకు సంబంధించిన సమాచారం అందిందని, మొత్తం ఆరు ఘటనలు నమోదైనట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణల్లో కొన్నింటిని అమెరికా నేవీ, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఖండిస్తూ. సైనికులకు అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!