

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా సహా పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇంధన సర్‌ఛార్జితో పాటు విమాన టికెట్ల ధరల పెరుగుదల కూడా ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.
గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల సంఖ్య 4.42 లక్షల నుంచి 4.30 లక్షలకు తగ్గింది. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 11.37 లక్షల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఈ ఏడాది అదే కాలంలో 11.20 లక్షల మంది మాత్రమే ప్రయాణించారని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లింది. గతంలో 8-12 శాతం వరకు నమోదైన వృద్ధిరేటు గతేడాది అక్టోబర్ నుంచి క్రమంగా తగ్గుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!