
ఆరోగ్యం

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు కస్టడీలో ఓ యువకుడు మృతి చెందిన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కస్టడీ మరణాన్ని దాచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను కప్పిపుచ్చేందుకు కట్టుకథలు చెబుతున్నారంటూ డీజీపీపై కూడా అసహనం వ్యక్తం చేసింది.
కస్టడీలో హింసకు పాల్పడిన ఘటనకు బాధ్యులైన అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 13లోగా సీబీఐ దర్యాప్తు నివేదికను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!