

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఉదయం 6:15 గంటలకు శ్రీ దుర్గా స్నానఘాట్ వద్ద విఘ్నేశ్వర పూజతో వరుణ యాగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు వరుణ అనువాక సహిత కారక పారాయణాలు నిర్వహించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి పారాయణాలు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!