
జనరల్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి బగీరథ్ తనను బ్లాక్మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం ఈ వ్యవహారంలో పాల్గొంటుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్నేహితుల ద్వారా ఒక యువతితో పరిచయం ఏర్పడిందని, ఆలయాలు మరియు సామాజిక కార్యక్రమాలకు కలిసి వెళ్లామని బగీరథ్ తెలిపారు. అయితే ప్రస్తుతం మెసేజ్లు, వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఆమెను పెళ్లి చేసుకోవాలని లేకపోతే రూ.5 కోట్లు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.50 వేలును చెల్లించానని, ఇంకా డబ్బులు అడుగుతున్నారని పేర్కొన్నారు. తాను అమాయకుడినని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆయన వేడుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!