
జనరల్

కోమల్ ఖండేల్వాల్ అనే 24 ఏళ్ల యువతి అమెరికాలో ఉన్నత విద్య కోసం తీసుకున్న రూ.45 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌ను ఉద్యోగంలో చేరిన ఆరు నెలల్లోనే పూర్తిగా చెల్లించి వార్తల్లో నిలిచారు. 20 ఏళ్ల వయసులో అమెరికాలో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేయడానికి ఆమె ఈ రుణం తీసుకున్నారు. 21 ఏళ్లకే చదువు పూర్తి చేసిన కోమల్, 22 ఏళ్లు నిండకముందే మాన్‌హట్టన్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు.
అమెరికాలో ఉన్న సమయంలో తన సంపాదనతో 10 దేశాల్లో ఒంటరిగా పర్యటించినట్లు కోమల్ తెలిపారు. చదువు, ఉద్యోగం, ప్రయాణాల కోసం నాలుగైదేళ్లు విదేశాల్లో గడిపిన ఆమె, ఇప్పుడు భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన సాధించడం, క్రమశిక్షణతో రుణాన్ని తీర్చడం వంటి అంశాలతో ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!