

తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న ఖర్గే ఆరోగ్య పరిస్థితిని వివేక్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల అంశాలను ఆయనకు వివరించారు. ముఖ్యంగా 22ఏ భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సమాధానం, రాష్ట్రంలో చర్చనీయాంశమైన ఇతర రాజకీయ పరిణామాల గురించి ఖర్గేకు వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల అంశాన్ని కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, 22ఏ భూముల సమస్యతో పాటు ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపైనా చర్చ జరిగినట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన రాజకీయ, పరిపాలనా అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!