

ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ను చూపించేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ మోడల్ అమరావతి నుంచే రావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన.. అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ను ముందంజలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సహకారం, మార్గదర్శనం అవసరమని కోరారు.
పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు, పరిశోధనలను ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో 23 రంగాల వారీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. హార్టికల్చర్, ఆక్వాకల్చర్ నుంచి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్ల వరకు వివిధ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే పదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, ఆ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!