
బిజినెస్

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను నేడు కృష్ణలంక పోలీసులు కోర్టుకు సమర్పించనున్నారు. స్టేషన్ పరిధిలోని సీసీటీవీ ఫుటేజ్‌లకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్‌లు మరియు బ్యాకప్ డేటాను న్యాయస్థానానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, సంబంధిత హార్డ్ డిస్క్‌లు మరియు డీవీఆర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ డిజిటల్ ఆధారాలను నేడు సీల్డ్ కవర్‌లో సమర్పించనున్నారు. కేసు దర్యాప్తులో సీసీ ఫుటేజ్ కీలక పాత్ర పోషించే అవకాశముందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!