

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం కీలక మలుపుగా నిలిచిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో తనకు భారీ విజయాలను అందించిన దర్శకులపై నమ్మకంతో మరోసారి అవకాశాలు ఇచ్చే విధానాన్ని మహేశ్ బాబు అనుసరించేవారు. గుణశేఖర్‌తో ‘ఒక్కడు’ తర్వాత ‘అర్జున్’, ‘సైనికుడు’, శ్రీను వైట్లతో ‘దూకుడు’ తర్వాత ‘ఆగడు’, పూరి జగన్నాథ్‌తో ‘పోకిరి’ తర్వాత ‘బిజినెస్‌మ్యాన్’, శ్రీకాంత్ అడ్డాలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’, త్రివిక్రమ్‌తో ‘అతడు’ తర్వాత ‘ఖలేజా’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలు చేశారు.
అయితే ‘బిజినెస్‌మ్యాన్’ మినహా మిగతా చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా మహేశ్ బాబు కెరీర్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కథలు, దర్శకుల ఎంపికలో ఆయన మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గత దర్శకులతో తిరిగి పనిచేసే విషయంలో కూడా మహేశ్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!