

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన సతీమణి తమ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. అనంతరం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విజ్ఞప్తి మేరకు మొక్క నాటి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శైలిమ, హిమాన్షు, రియాన్షి సహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ముందుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!