
రాజకీయాలు

హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. సభ ముందున్న అంశాలు, చర్చించాల్సిన విషయాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశాల వ్యవధిని మరింత పొడిగించాల్సిన అవసరంపై నిర్ణయం తీసుకునేందుకు బీఏసీ మరోసారి సమావేశం కానుంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై అసెంబ్లీలో చర్చకు బీఏసీ ఆమోదం తెలిపింది. 22ఏ అంశంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. అలాగే మొత్తం 25 అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని వారు కోరారు. బీఏసీ తుది అజెండా, సభా కార్యక్రమాలను ఖరారు చేసిన అనంతరం ఆయా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!