

యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు దక్షిణ సౌదీ అరేబియాలోని పౌర, ఆర్థిక కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. అబ్హా, ఖమీస్ ముషైత్, జిజాన్, నజ్రాన్ ప్రాంతాల్లోని కీలక మౌలిక వసతులు, ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 73 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో కొన్ని ఇంధన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దేశ సార్వభౌమత్వాన్ని, కీలక ఇంధన మౌలిక వసతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల యెమెన్‌లో జరిగిన సౌదీ చర్యలకు ప్రతిస్పందనగానే ఈ దాడులు చేశామని హౌతీలు ప్రకటించారు. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లపైనా ప్రభావం పడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 98 డాలర్లకు చేరువైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!