
జనరల్

విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుస్మిత నియామకంతో పవన్ కల్యాణ్, చిరంజీవి కుటుంబానికి సంబంధించిన మరో వ్యక్తికి కీలక బాధ్యత దక్కినట్లైంది.
దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో సుస్మితకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా బాధ్యతలు అప్పగించడంతో ఈ నియామకం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!