

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతున్న నీటి వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. ముందుగా నిర్ణయించిన అజెండా లేకుండానే తెలంగాణ అధికారులు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. తెలంగాణలోని సుమారు 30–50 ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే గోదావరి బేసిన్‌లో నీటి లభ్యతను సమగ్రంగా లెక్కించాలని కోరింది. ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాల ఆధారంగా కేంద్ర జల సంఘం (CWC) సమావేశ అజెండాను ఖరారు చేయనుంది. మరో 10–15 రోజుల్లో సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులతో మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!