

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహిళల ఆరోగ్యం, గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘నేషన్‌వైడ్ హెచ్‌పీవీ అవేర్‌నెస్ డ్రైవ్’ను ప్రారంభించింది. అసోసియేషన్ ప్రతినిధి ధర్మేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిది ప్రధాన రాష్ట్రాల్లోని ప్రభుత్వ, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో 1,000కు పైగా అవేర్‌నెస్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌పీవీ నివారణ, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన, వ్యాక్సినేషన్, స్క్రీనింగ్, సకాలంలో చికిత్స వంటి అంశాలను విద్యార్థులు, స్థానిక సమాజాలకు వివరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా, సమాజం సహకరించాలని ఆయన కోరారు.
ఈ అవేర్‌నెస్ డ్రైవ్‌కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం సమాచారాన్ని కూడా అనుసంధానం చేస్తున్నారు. అసోసియేషన్ పంచుకున్న సమాచారం ప్రకారం.. ఈ కార్యక్రమం 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. అర్హులైన కౌమారదశ బాలికలకు తల్లిదండ్రులు లేదా గార్డియన్ల సమ్మతితో నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో గార్డాసిల్-4 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. యూ-విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లేదా సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అవేర్‌నెస్ కార్యక్రమాలకు సంబంధించిన ఈవెంట్ షెడ్యూల్‌ను కూడా అసోసియేషన్ విడుదల చేసింది. సినిమా అభిమానుల నెట్‌వర్క్‌ను సామాజిక ప్రయోజనం కోసం వినియోగిస్తున్న ఈ కార్యక్రమంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!