

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితిని పెంచాలని, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉందని, అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. నోటిఫికేషన్లలో జాప్యం, వయోపరిమితి పెంచకపోవడంతో పలువురు అభ్యర్థులు వయసు దాటిపోయి ఉద్యోగాలకు అర్హత కోల్పోయారని అన్నారు.
ఎస్సై ఉద్యోగాలకు 38 ఏళ్లు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 36 ఏళ్ల వరకు వయోపరిమితిని పెంచాలని కవిత డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంచితే మరో రెండు నుంచి మూడు లక్షల మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. సుమారు 20 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 7 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. హోంశాఖ, ప్రభుత్వ ప్రకటనల్లో సమన్వయం కనిపించడం లేదని విమర్శించారు. వయోపరిమితి పెంపు అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ, ఈ డిమాండ్‌పై పోరాడుతున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!