
గాసిప్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ, శాసన మండలిలో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యతో బీఆర్ఎస్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది.
ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్ ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. తాతా మధు, నవీన్ రెడ్డిలపై తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ పరిణామాలతో శాసన మండలి ప్రాంగణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!