
గాసిప్స్

వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన చిన్న శ్రీనుకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. చిన్న శ్రీను, ఆయన అనుచరులు టీడీపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. అధికార పార్టీ ముఖ్య నేతల సమక్షంలో జరిగిన ఈ చేరికకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!