

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణలో పారిశ్రామిక విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు చెప్పారు. రైజింగ్ తెలంగాణ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాలను మంత్రి మీడియాకు వివరించారు. రెండో గ్లోబల్ సమిట్ నిర్వహణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. సమిట్ విజయవంతంగా నిర్వహించేందుకు సీనియర్ మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ సమిట్ సందర్భంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయనే నమ్మకం ఉందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయవద్దన్న సూచనల మేరకు చర్యలు తీసుకున్నామని, ఎన్‌డీఎస్‌ఏ సూచించిన అన్ని పరీక్షలను పూర్తి చేసి నివేదికలు సమర్పించామని వెల్లడించారు. ప్రాజెక్టు మరమ్మతులను పారదర్శకంగా చేపట్టి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!