6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

Writer: Shivani K 11:37 PM, 5 నవంబర్, 2026
తెలంగాణ  కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 7 నుంచి 9 వరకు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నవంబర్ 9న భారీ రైతు బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి, ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. అదే రోజున ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరించనున్నాయి.

మరోవైపు, ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, రెండు వర్గాలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక్కో కమిషన్‌లో ఒక ఛైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. తెలంగాణ అగ్నిమాపక సేవల చట్టం-1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాదాల నివారణ, కారణాల గుర్తింపు, అత్యవసర స్పందనకు సంబంధించిన నిబంధనలను ఇందులో పొందుపరచనున్నారు. అలాగే తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం-1923లోని సెక్షన్ 12(ఏ)ను సవరించి, అప్పీల్ చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. కాటారం, ఎల్కతుర్తి కోర్టులతో పాటు సిద్దిపేట, చౌటుప్పల్, మహబూబాబాద్, వేములవాడ కోర్టుల్లో వివిధ విభాగాలకు మొత్తం 136 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరాగ్వేలో బ్యాంకింగ్ సంక్షోభం.. అధ్యక్షుడి రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు!

పరాగ్వేలో బ్యాంకింగ్ సంక్షోభం.. అధ్యక్షుడి రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు!

భారత క్షిపణి ప్రయోగం ప్రళయ్ సక్సెస్

భారత క్షిపణి ప్రయోగం ప్రళయ్ సక్సెస్

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ పారిశ్రామిక విధానాలు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ పారిశ్రామిక విధానాలు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మయోనైజ్‌పై ఏడాది నిషేధం

తెలంగాణలో మయోనైజ్‌పై ఏడాది నిషేధం

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంతెలంగాణ కేబినెట్సీఎం రేవంత్ రెడ్డిఇందిరమ్మ కుటుంబ బీమాఇందిరమ్మ ఇళ్లుఇందిరమ్మ చీరలుఎస్సీ ఎస్టీ కమిషన్లుకొడంగల్ రైతు సభఅగ్నిమాపక చట్టంతెలంగాణ అభివృద్ధి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక
రాజకీయాలు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

తెలంగాణ  కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

పరాగ్వేలో బ్యాంకింగ్ సంక్షోభం.. అధ్యక్షుడి రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు!
జనరల్

పరాగ్వేలో బ్యాంకింగ్ సంక్షోభం.. అధ్యక్షుడి రాజీనామాతో రాజకీయ ప్రకంపనలు!

భారత క్షిపణి ప్రయోగం ప్రళయ్ సక్సెస్
జనరల్

భారత క్షిపణి ప్రయోగం ప్రళయ్ సక్సెస్

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ పారిశ్రామిక విధానాలు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
జనరల్

ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ పారిశ్రామిక విధానాలు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో మయోనైజ్‌పై ఏడాది నిషేధం
జనరల్

తెలంగాణలో మయోనైజ్‌పై ఏడాది నిషేధం

రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం
బిజినెస్

రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
జనరల్

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం
సినిమాలు

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!
బిజినెస్

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!