
టెక్నాలజీ

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మికుల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని, తమ ప్రభుత్వంలో వారికి సముచిత గౌరవం లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులే ముఖ్య భాగస్వాములని, కొత్త పారిశ్రామిక విధానం వారి అభ్యున్నతికి దోహదపడుతుందని వెల్లడించారు.
కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా, గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమ బిల్లు, సింగరేణి కార్మికులకు పండుగల ముందే బోనస్ వంటి పథకాలను అమలు చేసినట్టు చెప్పారు. అదేవిధంగా కార్మికులకు రూ.1 కోటి బీమా సదుపాయం, గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వివరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!