

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలో పేపర్ లీక్, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. నియామక పరీక్షను రద్దు చేయాలని, ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.
ముఖ్యమంత్రికి పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం, జేపీఎస్‌సీ నుంచి తగిన చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్లు బయటకు వచ్చిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆరోపిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియామక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి సీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!