
జనరల్

పంచదార ఎగుమతులను తక్షణం నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఉత్తర్వులు జారీ చేసింది. ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది.
ఈ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమల్లో ఉంటుంది. అయితే ఇప్పటికే లోడింగ్ ప్రారంభమైన లేదా కస్టమ్స్‌కు అప్పగించిన చక్కెర నిల్వలకు ఎగుమతి అనుమతి ఉంటుంది. అలాగే యూరప్, అమెరికాకు ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!