

బేగంపేటకు చెందిన ఓ గృహిణి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ప్రకటనకు ఆకర్షితురాలై బ్యాంకు ఖాతాలు అందిస్తే భారీ కమీషన్ ఇస్తామని నమ్మింది. తన ఖాతా ఇచ్చి నెలకు ₹10వేలు సంపాదించింది. మరింత డబ్బు ఆశతో బంధువుల నుంచి ఆరు ఖాతాలు సేకరించి దళారులు సూచించిన చిరునామాకు పంపించింది. ఈ వ్యవహారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చి ఆమె అరెస్టై జైలుకెళ్లాల్సి వచ్చింది.
సామాజిక మాధ్యమాల ద్వారా మ్యూల్ ఖాతాలు సేకరించేందుకు మోసగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. నగరంలో గత ఐదు నెలల్లో 200 మందికిపైగా అరెస్టు కావడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. డీసీపీ అరవింద్ బాబు ప్రకారం, విదేశాల్లో ఉన్న ముఠాలు భారతీయుల సిమ్‌లు, ఫోన్లు ఉపయోగించి మోసాలు చేస్తూ డబ్బును క్రిప్టో రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రమేయం కూడా ఉండటం పోలీసులకు సవాలుగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!