

హైదరాబాద్‌లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ ప్రాజెక్ట్‌కు అడుగులు పడుతున్నాయి. కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ పేరుతో ట్విన్-టవర్ అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు. ట్రంప్ బ్రాండ్‌కు భారతదేశంలో అధికారిక భాగస్వామిగా ఉన్న ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియల్టీతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA)లో ఈ ప్రాజెక్ట్ నమోదైంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 2.65 లక్షల చదరపు మీటర్లుగా ఆమోదం పొందింది.
RERA వివరాల ప్రకారం ప్రాజెక్ట్‌లో రెండు వింగ్స్ ఉంటాయి. ఒక్కో వింగ్‌కు 65 సూపర్‌స్ట్రక్చర్ స్లాబ్‌లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 2031 గడువును అధికారికంగా నమోదు చేశారు. విశాలమైన ప్రీమియం నివాసాలతో ఈ ప్రాజెక్ట్‌ను అల్ట్రా-లగ్జరీ విభాగంలో అభివృద్ధి చేస్తున్నారు. కోకాపేట ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రముఖ లగ్జరీ రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ట్రంప్ బ్రాండ్ ప్రవేశం ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత తీసుకురానుంది. దక్షిణ భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు ఇది తొలి ప్రాజెక్ట్‌గా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!