

ఆలేరు మండలంలోని టంగుటూరు, శరాజీపేట, కొల్లూరు, మదనపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న లో వోల్టేజీ, విద్యుత్ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం శరాజీపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ తరచూ విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బోరుబావుల స్టార్టర్లు తరచూ కాలిపోవడంతో మరమ్మతులకు అదనపు ఖర్చులు అవుతున్నాయని, సక్రమంగా విద్యుత్ అందక పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్‌స్టేషన్ ముట్టడి విషయం తెలుసుకున్న ఆలేరు ఏడీఈ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామాల్లోని లో వోల్టేజీ సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారి హామీతో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!