
జనరల్

ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఇరాన్ యుద్ధం దాదాపు నాలుగు నెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యలకు ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3.6 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.
అమెరికా సెనెట్ అప్రోప్రియేషన్స్ కమిటీ సమావేశంలో హెగ్సెత్ మాట్లాడుతూ, సైనిక చర్యలను కొనసాగించేందుకు అదనపు నిధులు అవసరమని తెలిపారు. అమెరికా ప్రభుత్వం 67 బిలియన్ డాలర్ల అదనపు నిధుల ప్యాకేజీకి ఆమోదం కోరుతోంది. మరోవైపు యుద్ధ వ్యూహం, పెరుగుతున్న ఖర్చులు, ముగింపు ప్రణాళికపై డెమోక్రటిక్ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇరాన్ నుంచి ముప్పు కొనసాగుతున్నందున సైనిక చర్యలు అవసరమని హెగ్సెత్ సమర్థించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!