
జనరల్

భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, టోలీచౌకి వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ మరికొన్ని గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!