

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షల్లో సమగ్ర సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం హైపవర్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ఫోర్స్లో మాజీ ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, మాజీ ఐబీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కరాల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. పరీక్షల నిర్వహణను విశ్వసనీయంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం ఈ బృందం ప్రధాన లక్ష్యంగా ఉంది.
పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంపై ఈ టాస్క్ఫోర్స్ దృష్టి సారించనుంది. విద్యార్థులకు సులభమైన, నమ్మకమైన విధానాలను అందించేందుకు అవసరమైన మార్పులపై సూచనలు చేయనుంది. భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, నిర్ధిష్ట మార్గదర్శకాలు రూపొందించడం ద్వారా పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!