
జనరల్

తిరుపతిలో తొలి కరోనా కేసు అధికారికంగా నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న కరోనా పరీక్ష నిర్వహించగా, జూలై 24న ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్య అధికారులు వెంటనే చికిత్స ప్రారంభించారు.
ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందుతుండగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ఎవరికీ ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని జిల్లా వైద్యశాఖ వెల్లడించింది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!