
జనరల్

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైన వెంటనే ఉదయ్‌కృష్ణారెడ్డి పరారీలోకి వెళ్లినట్లు సమాచారం.
గత రెండు రోజులుగా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో పేర్కొన్న రెండు చిరునామాల్లో ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!