
సినిమాలు

టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పాల్గొన్న ఒక కార్యక్రమంలో బొండా ఉమా వేదిక పంచుకోవడంపై పార్టీ వివరణ కోరింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై తరచూ విమర్శలు చేసే నాయకుడితో కలిసి పాల్గొనడం సరైన నిర్ణయం కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కూటమి శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతోంది. పొత్తు ధర్మాన్ని పాటించడం ప్రతి నాయకుడి బాధ్యత అని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. బొండా ఉమా నుంచి వివరణ వచ్చిన అనంతరం పార్టీ అధిష్ఠానం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!