
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యువతకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను జెన్ Z నాయకులుగా చూపిస్తూ ప్రజలను మోసం చేయొద్దని ఆయన విమర్శించారు. నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనుకుంటే విద్య, హోంశాఖల వంటి కీలక బాధ్యతలను యువ నాయకులకు అప్పగించాలని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మొదటి ఐదేళ్లు కేంద్రంతో సఖ్యతగా ఉండి నిధులు సాధించిందని, రెండో విడతలో ఘర్షణల కారణంగా భారీ అప్పులు చేసిందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారీ స్థాయిలో అప్పులు చేసినట్లు ఆరోపిస్తూ, రాజకీయ వ్యాఖ్యల కంటే ప్రజా పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!