
సినిమాలు

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో నాగార్జున అక్కినేని 100వ సినిమా ఒకటి. దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. సినిమా టైటిల్, నాగార్జున పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం ఇప్పటివరకు రహస్యంగానే ఉంచింది.
తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘KING100’ టైటిల్ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టైటిల్‌తో పాటు నాగార్జున కొత్త లుక్ కూడా అదే రోజు రివీల్ అయ్యే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!