

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ మరియు పరిషత్ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన షెడ్యూల్‌ను రూపొందించింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలను ప్రారంభించాలని నిర్ణయించగా, అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను సుమారు 40 రోజులలో విడతలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. చివరి విడతలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!