
జనరల్

బంగాళాఖాతంలో కనిపిస్తున్న ఎల్‌నినో ప్రభావం కారణంగా అనకాపల్లి జిల్లా బోయపాడు సముద్ర తీరంలో వేలాది చేపలు మృతి చెందాయి. ఈ ఘటనపై పరిశీలన చేపట్టిన జాతీయ మత్స్యాభివృద్ధి సంస్థ, ఎల్‌నినో ప్రభావమే చేపల మరణాలకు ప్రధాన కారణమని నిర్ధారించింది.
సముద్రంలోని వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల నీటి ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ స్థాయిలు ప్రభావితమయ్యాయని నివేదిక పేర్కొంది. దీంతో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!