
జనరల్

తెలంగాణలో ఎంబీబీఎస్ వైద్య విద్య ఫీజుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023–26 విద్యా సంవత్సరానికి అమల్లో ఉన్న ఫీజులనే 2026–29 విద్యా సంవత్సరానికీ కొనసాగిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. దీంతో ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని వివిధ కేటగిరీల విద్యార్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులే వర్తించనున్నాయి.
ఏ కేటగిరీలో చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.60 వేలు ఫీజుగా నిర్ణయించగా, బీ కేటగిరీలో రూ.11.55 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఫీజు ఉంటుంది. సీ కేటగిరీలో బీ కేటగిరీ ఫీజుకు రెట్టింపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు. ఫీజుల్లో మార్పులు లేకపోవడంతో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కొంత ఊరట లభించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!