
జనరల్

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 31 వరకు సీఐఎస్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ప్రయాణికుల రద్దీ, వాహనాల కదలికలపై నిఘాను మరింత పెంచారు.
టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సందర్శకుల పాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే అనుమతిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!