

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, తన చిరకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్‌ను వివాహం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వెడ్డింగ్ రింగులను చూపిస్తూ రొనాల్డో చేసిన పోస్టుతో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన పేరులోని ‘C’, జార్జినా పేరులోని ‘J’ అక్షరాల మధ్య ప్రేమ చిహ్నాన్ని క్యాప్షన్‌గా ఉంచారు. ఈ ప్రకటనకు భారీ స్పందన లభించగా, కొద్ది గంటల్లోనే లక్షలాది మంది అభిమానులు స్పందించారు.
41 ఏళ్ల రొనాల్డో, 32 ఏళ్ల జార్జినాతో దాదాపు పదేళ్లుగా సంబంధంలో ఉన్నారు. వీరిద్దరూ 2016లో తొలిసారి కలుసుకున్నారు. అనంతరం తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. గతంలో వారి వివాహంపై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు అధికారిక ప్రకటనతో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. రొనాల్డోకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. జార్జినాతో తన బంధం క్రమంగా మరింత బలపడిందని ఆయన గతంలో వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!