
జనరల్

రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లకుండానే ప్రజలు ఇంటి నుంచే వివిధ సేవలను పొందేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్ అనుమతిపత్రానికి సంబంధించిన పలు సేవలను పూర్తిగా ఆన్లైన్లో అందించేందుకు ముఖాముఖి రహిత సేవలను ప్రారంభించారు. ఆధార్ ధ్రువీకరణతో పాటు అవసరమైన పత్రాలను జతచేసి దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఈ సేవలు ప్రస్తుతం సారథి పోర్టల్ లో అందుబాటులోకి వచ్చాయి.
డ్రైవింగ్ అనుమతిపత్ర పునరుద్ధరణ, చిరునామా మార్పు, పేరు మార్పు, ఫొటో, సంతకం, జనన తేదీ సవరణలు వంటి సేవలను ఇప్పుడు ఆన్లైన్లో పొందవచ్చు. అదనంగా నకలు అనుమతిపత్రాలు, ప్రమాదకర పదార్థాల రవాణా అనుమతులు, ప్రజా సేవా వాహన గుర్తింపు పత్రాలు వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ సేవలను మొబైల్ అనువర్తనంలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!