
జనరల్

హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ మహంకాళి బోనాల జాతరలో సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ కల్చర్ అంటే అందరినీ అంగీకరించడం, అందరితో కలిసి ఉండటమేనని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అన్ని మతాల్లోని మంచిని స్వీకరించి, మానవత్వంతో జీవించాలని తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించారని ఫరియా గతంలో వెల్లడించారు. బోనాల వేడుకల్లో ఆమె స్పందన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సమైక్యతపై ఆమెకున్న అభిమానాన్ని చాటిచెప్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!