
క్రీడలు

పాకిస్తాన్‌లోని ఖైబర్ ప్రావిన్స్‌లో ఘోర ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్‌పై ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో దాడి చేయడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి పోలీస్ పోస్ట్ భవనం పూర్తిగా ధ్వంసమైంది.
దాడి అనంతరం భద్రతా బలగాలు ప్రతిదాడి చేపట్టగా పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు. అయినప్పటికీ ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పని అయి ఉండొచ్చని భద్రతా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!