
రాజకీయాలు

వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు తమ వాహనాల్లో పెద్దఎత్తున రావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాక్షిగణపతి నుంచి హఠకేశ్వరం వరకు, అలాగే ముఖద్వారం నుంచి సుండిపెంట వరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం ఆలయంలో స్వామి, అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ కూడా పెరిగింది. ప్రస్తుతం దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!