

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఆగస్టు 15న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో 160కి పైగా చిత్రాల్లో నటించి, కన్నడ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశభక్తి, సామాజిక సందేశాలతో కూడిన చిత్రాలతో పాటు యాక్షన్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ‘జెంటిల్‌మన్’, ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘రిథమ్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అర్జున్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విజయ్ నటించిన ‘లియో’లో హెరాల్డ్ దాస్ పాత్రలో పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించారు. ఇటీవల ‘బ్లాస్ట్ జోన్’లో కరాటే మాస్టర్ రాజారామ్‌గా యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!