

తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మన చరిత్రను తెలుసుకోవాలని, పూర్వీకుల పోరాటాలను పిల్లలకు వివరించాలని అన్నారు. చరిత్రను అర్థం చేసుకున్నవారే భవిష్యత్తును మెరుగ్గా నిర్మించగలరని పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలనలో జరిగిన దోపిడీ, అణచివేత, జలియన్ బాగ్ ఘటన, కృత్రిమ కరువులు, ప్రపంచ యుద్ధాల్లో భారతీయులను వినియోగించిన తీరును ప్రజలు తెలుసుకోవాలని కవిత అన్నారు. బ్రిటీష్ పాలన ముగిసినా వారి ఆలోచనా విధానాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆంగ్ల భాష మాట్లాడేవారినే గొప్పగా చూసే ధోరణిని మార్చుకోవాలని సూచించారు. మన భాష, సంస్కృతి, చరిత్రను గౌరవించాలని, బ్రిటీష్ పాలన ప్రభావం నుంచి ఆలోచనా పరంగా కూడా బయటపడాలని ఆమె పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!